News April 4, 2024
అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

AP: కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించనున్న ఆయన.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీకి చెందిన బుద్ధప్రసాద్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.
Similar News
News February 13, 2026
జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుల హవా!

TG: INCలో వివాదంగా మారిన జగిత్యాల మున్సి‘పోల్స్’లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు రెబల్స్‌గా పోటీచేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. BRS MLA సంజయ్ అనుచరులకు పార్టీ టిక్కెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీచేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో INC 12, BJP 4, BRS 4, MIM 2 వార్డులను దక్కించుకున్నాయి.
News February 13, 2026
కోళ్లలో కొక్కెర వ్యాధిని ఇలా గుర్తించండి

కొక్కెర వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గి, శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లు బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3-4 రోజుల్లో మరణిస్తాయి.



