News September 11, 2025
పవన్ బాపట్ల పర్యటన రద్దు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Similar News
News December 8, 2025
ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.
News December 8, 2025
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

☛ బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
News December 8, 2025
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.


