News March 31, 2024

పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: పేర్ని నాని

image

AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘వైసీపీపై వ్యతిరేకత ఉంటే పవన్ మళ్లీ భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఇప్పుడు పిఠాపురంలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. చంద్రబాబువి నీచ రాజకీయాలు. వాలంటీర్లపై ఆయన కక్ష పెంచుకున్నారు. కక్షతోనే పెన్షన్లు అడ్డుకోవాలని చూశారు.’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News February 13, 2026

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్

image

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ నియమితులయ్యారు. రియాన్ పరాగ్ తమ సారథి అని ఆ జట్టు ట్వీట్ చేసింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, వాట్సన్, రహానే, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ పేర్లతో పోస్టర్ రిలీజ్ చేసింది. గతేడాది వరకు సారథిగా వ్యవహరించిన సంజూ ట్రేడ్‌లో CSKకు వెళ్లిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌లో పలు మ్యాచులకు పరాగ్ కెప్టెన్‌గా చేశారు.

News February 13, 2026

ఆర్మీలో అగ్నివీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్(GD, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, డిప్లొమా అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 17.5 – 22 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. సైట్: https://joinindianarmy.nic.in

News February 13, 2026

PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ

image

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్‌ను PM మోదీ ప్రారంభించారు. దీంట్లో PMOతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సంబంధించిన ఆఫీసులుంటాయి. ఇక నుంచి PMOను సేవా తీర్థ్‌గా పిలుస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్‌కు కర్తవ్య భవన్‌గా నామకరణం చేశారు. గతంలో ఇవన్నీ సెంట్రల్ విస్టా పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉండేవి. దీనివల్ల పరిపాలనాపరమైన ఆలస్యం చోటు చేసుకునేది.