News March 31, 2024
పవన్‌కు మాటలెక్కువ.. వచ్చే ఓట్లు తక్కువ: వైసీపీ

AP: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ కళ్యాణ్ వేసిన <<12957341>>సెటైర్లకు<<>> ఆ పార్టీ Xలో కౌంటర్ ఇచ్చింది. ‘ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ అన్నట్లుగా మళ్లీ ఓడిపోయే పవన్‌కు మాటలెక్కువ, వచ్చే ఓట్లు తక్కువ. ఈసారి పొలిటికల్ పిట్టల దొరకు పిఠాపురంలో ఓటమి తప్పదు. మీ పొత్తు పార్టీలన్నీ కట్టగట్టుకుని వచ్చినా అందర్నీ మోపుకట్టి గోదారిలో నిమజ్జనం చేయడానికి ఓటర్లు సిద్ధం’ అని పేర్కొంది.
Similar News
News February 17, 2026
AIIMS రిషికేశ్‌లో కాంట్రాక్ట్ పోస్టులు

AIIMS రిషికేశ్ 3 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc నర్సింగ్, బీఫార్మసీ, డీ ఫార్మసీ, BSc మెడికల్ టెక్నాలజీ, BSc (రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్), BSc(కంప్యూటర్ అప్లికేషన్స్) అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్, టెక్నీషియన్‌కు రూ.40K, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.30K చెల్లిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News February 17, 2026
ధూపం ఇలా పెడితే..

ధూపంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అందులో కర్పూరం, లవంగాలు కలిపి వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ‘గుగ్గులు ధూపం మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవు పిడకలపై పసుపు ఆవాల ధూపంతో ప్రతికూల శక్తి నశిస్తుంది. సంపాదన నిలకడగా ఉండాలంటే అగరుబత్తీల ధూపం, వాస్తు దోష నివారణకు వేపాకు ధూపం ఎంతో శ్రేష్ఠం. ఈ ఆచారాలు ఇల్లాంతటా ఆధ్యాత్మిక సుగంధాన్ని, ప్రశాంతతను నింపుతాయి’ అంటున్నారు పండితులు.
News February 17, 2026
ఈ జిల్లాల్లో అకాల వర్షాలు

TG: ఈ నెల 22, 23, 24 తేదీల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 22న నార్త్, ఈస్ట్ జిల్లాల్లో (ఆదిలాబాద్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల etc), 23, 24 తేదీల్లో HYD, WGL, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడొచ్చని తెలిపారు. ఈ నెల 20 నాటికి దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.


