News February 27, 2025
Perplexity AIతో పేటీఎం జట్టు

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్ ఆప్షన్ అందించేందుకు Perplexityతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.
Similar News
News February 27, 2025
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: మాధవ్

APలో YCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. తాను న్యాయ నిపుణుల సలహా తీసుకుని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సూపర్-6 హామీలపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
News February 27, 2025
అత్యంత వివాదాస్పద చిత్రం ఇదే!

భారత సినీ పరిశ్రమలో ఎన్నో వివాదాస్పద సినిమాలున్నాయి. కానీ, పియర్ పాలో పసోలిని డైరెక్ట్ చేసిన ‘120 డేస్ ఆఫ్ సొదొమ్’ మాత్రం అత్యంత వివాదాస్పదమైంది. దీన్ని 150 దేశాలు బ్యాన్ చేశాయి. ఇది 1975లో ఇటాలియన్‌లో విడుదలైంది. వరల్డ్ వార్-2 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన కొద్దిరోజులకే డైరెక్టర్ హత్యకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన పిల్లలపై లైంగిక వేధింపులు, క్రూరంగా హింసించిన దృశ్యాలను ఇందులో చూపించారు.
News February 27, 2025
9 నెలల్లోనే కూటమి మోసం ప్రజలకు అర్థమైంది: చెల్లుబోయిన

AP: ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విస్మరించారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 9 నెలల పాలనలోనే ప్రభుత్వం చేసిన మోసం ప్రజలకు అర్థమైందన్నారు. కక్ష సాధింపులకే సమయం వెచ్చిస్తూ పాలన గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర అప్పులు, తిరుమల లడ్డూ అంశంలో అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. నిత్యావసరాల ధరలను భారీగా పెంచేశారని ఆరోపించారు.