News November 14, 2024
అదే జరిగితే $65 మిలియన్లు కోల్పోనున్న PCB
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు భారత్ వెళ్లకపోతే ఆ దేశం భారీగా నష్టపోనుంది. మొండి వైఖరితో టోర్నీ నిర్వహణ నుంచి దాయాది వైదొలిగితే భారీగా నిధులను ఐసీసీ తగ్గించవచ్చని క్రిక్‌బజ్ వెల్లడించింది. ఒక వేళ టోర్నీని తరలించినా, వాయిదా వేసినా హోస్ట్ ఫీజుగా $65 మిలియన్లను కోల్పోతుందని తెలిపింది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాలను PCB అప్‌గ్రేడ్ చేసింది. దీంతో నష్టం మరింత పెరగనుంది.
Similar News
News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ పబ్లిసిటీ స్టంట్: కేంద్ర మంత్రి
క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని, ఈ విషయాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ మరోసారి నిరూపించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు TG ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆ నిందను పోగొట్టేందుకు ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని ఆరోపించారు. TG ప్రభుత్వం సినీ ప్రముఖులపై దాడులు చేసే బదులు బాధితులను ఆదుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని శిక్షించాలన్నారు.
News December 13, 2024
రేపటి నుంచే మూడో టెస్ట్.. షెడ్యూల్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి గబ్బాలో BGT మూడో టెస్ట్ జరగనుంది. 5.50am-7.50am ఫస్ట్ సెషన్, 8.30am-10.30am సెకండ్ సెషన్, 10.50am-12.50 pm థర్డ్ సెషన్ జరుగుతుంది. భారత జట్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, అశ్విన్ ప్లేస్‌లో సుందర్ ఆడే ఛాన్సుంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. అటు AUSలో బొలాండ్ స్థానంలో హెజిల్‌వుడ్ ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు .
News December 13, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ICC ఓకే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌కు ICC ఆమోదం తెలిపినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. BCCI, PCB ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నాయి. IND ఆడే మ్యాచులు దుబాయ్‌లో, ఇండియాVSపాక్ మ్యాచ్ మాత్రం కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం. IND మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయినందుకు PCBకి ఎలాంటి ఆర్థిక పరిహారం ఇవ్వరని, 2027 తర్వాత ICC ఉమెన్స్ టోర్నమెంట్ హోస్టింగ్ హక్కులను మాత్రం ఇస్తారని తెలుస్తోంది.