News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
Similar News
News February 18, 2026
టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <
News February 18, 2026
అంబటికి బెయిల్

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News February 18, 2026
కూరగాయలు తాజాగా ఉండాలంటే?

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.


