News October 8, 2025
PDPL: ఆశావహుల్లో అంతర్మథనం..!

ఎన్నికల కోడ్ కూసింది. ఇక రిజర్వేషన్ల లెక్కలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందనే ఆలోచనలో రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ టికెట్ ఇస్తేనే పోటీ చేసే ఆలోచనలో ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి డబ్బులు వృథాగా ఖర్చు చేసుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారు.
Similar News
News January 15, 2026
వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News January 15, 2026
NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.


