News December 1, 2025

PDPL: ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్‌ను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి–యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు సమయానికి అందించాలని సూచించారు.

Similar News

News February 19, 2026

NTR: PPP విధానంలో రోడ్లు.. ఇదెక్కడి కర్మ!

image

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 19 రోడ్లను PPP మోడల్లో నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించారు. 23.54 KM విస్తీర్ణంలో సర్కిల్-3లో 9, C-2లో 5, C-1లో 5 రోడ్లు వేయనున్నారు. బడ్జెట్ రూ.151Cr కాగా, 10 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులే వీటిని నిర్వహించనున్నారు. VMC వార్షిక బడ్జెట్ రూ.1643 కోట్లు ఉండగా, రోడ్లు కూడా కార్పొరేషన్ వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News February 19, 2026

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

image

సాధారణంగానే పిల్లలు కుదురుగా ఉండరు. అదేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. పిల్లలు చదివేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారుచేసి ఫాలో అవ్వాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.

News February 19, 2026

NTR: ఎం.టెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో ఎం.టెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 17 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26లోపు, రూ.100 ఫైన్‌తో 27లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.