News November 19, 2025

PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

వేప మందుల వాడకంలో మెళకువలు

image

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.

News January 17, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎక్జిమ్<<>> బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటినుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ , PG (MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, IB, CAలో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. వయసు 21- 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.eximbankindia.in/

News January 17, 2026

చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

image

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.