News November 19, 2025
PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
ప్రైవేట్ స్కూళ్లలో రెండేళ్లకోసారి 8% ఫీజు పెంపు?

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును రెండేళ్లకోసారి 8% పెంచుకునేలా అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకుమించి పెంచుకోవాలంటే రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2026
KNR: ఎటు చూసినా పరీక్షే.. ఉపాధ్యాయుల్లో గుబులు!

రాష్ట్రంలో మరోసారి ఓట్ల పండుగ మొదలుకానుంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియగా, ప్రస్తుతం ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, విద్యార్థులకు పరీక్షలు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. అయితే, ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడటం, వారి ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇస్తామనడం, మరోవైపు వరుస ఎన్నికలతో ఉపాధ్యాయులకు సంకట పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి.
News January 18, 2026
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే జీవ ఎరువు ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.


