News October 8, 2025
PDPL: తల్లిని చంపుతానని బెదిరించిన కొడుకుకి జైలు

PDPL(D) పాలకుర్తి (M) రామారావుపల్లికి చెందిన సందెవేన రమేశ్ తన తండ్రి శంకర్‌ను 2024 DECలో హత్య చేశాడు. ఈ కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చాడు. కాగా, తనపై కేసు పెట్టిన తల్లి గట్టమ్మను చంపుతానని బెదిరించాడు. దీనిపైనా తల్లి JUN 12న బసంతనగర్ PSలో ఫిర్యాదు చేసింది. దీంతో రమేశ్‌పై మళ్లీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో రమేశ్‌కు 3నెలల 16రోజుల జైలు శిక్ష విధిస్తూ GDK జడ్జి తీర్పునిచ్చారు.
Similar News
News January 18, 2026
VJA: గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

వైసీపీ అధినేత జగన్‌పై గతంలో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.
News January 18, 2026
ఆదివారం.. అమావాస్య.. మేడారం!

అసలే చొల్లంగి అమావాస్య ఆదివారం కావడం, రాష్ట్ర సర్కార్ క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం వెనుక మతలబేంటి అని చర్చ జరుగుతోంది. ఈరోజు తనపై ఎవరైనా నరదృష్టి చేసినా, తమపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పొగొట్టుకొవడానికి నాలుగు బాటల దగ్గర నిమ్మకాయ, గుడ్డును దాటుడు కోసం వేస్తారు. ఇలాంటి రోజు అడవిలో మంత్రుల సమావేశం నిర్వహించడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
News January 18, 2026
గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.


