News December 2, 2025
PDPL: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష

కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, నామినేషన్ల ప్రకటన, బ్యాలెట్ పేపర్ ముద్రణ, రవాణా సౌకర్యాలు, అభ్యర్థుల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహణ, ప్రతి మండలానికి బ్యాలెట్ బాక్స్ పంపిణీ వంటి అంశాలు చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం, సరైన లైటింగ్ ఉండేలా ఆదేశించారు.
Similar News
News February 13, 2026
GWL: మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ హవా..!

గద్వాల జిల్లాలో అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 77 వార్డులు ఉన్నాయి. ఈనెల 11న ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. శుక్రవారం అధికారులు ఫలితాలు వెల్లడించారు. బీజేపీ 7 వార్డులు, కాంగ్రెస్ 29 వార్డులు, బీఆర్ఎస్ 30 వార్డులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 వార్డులు ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలుపొందారు. ఒక స్థానం ఆధిక్యంతో బీఆర్ఎస్ ముందు వరసలో నిలిచింది.
News February 13, 2026
ఆర్మీలో అగ్నివీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్(GD, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, డిప్లొమా అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 17.5 – 22 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. సైట్: https://joinindianarmy.nic.in
News February 13, 2026
జమ్మికుంటలో దిగ్గజాలు కనుమరుగు.. కొత్త వారికి పట్టం!

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వినూత్న తీర్పు ఇచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలను పక్కనపెట్టి, ఉత్సాహవంతులైన కొత్త అభ్యర్థులను గెలిపించారు. ముఖ్యంగా గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవుల్లో పనిచేసి, పట్టణంపై పట్టున్న నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం గమనార్హం.


