News November 30, 2025

PDPL: ‘పంచాయతీ ఎన్నికలు ఫ్రీ & ఫెయిర్‌గా జరగాలి’

image

సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఫ్రీ & ఫెయిర్‌గా నిర్వహించాలని అన్నారు. ఎం.సి.సి నిబంధనలు కఠినంగా పాటించాలని, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని అన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ, ప్రచార ఖర్చులు రికార్డింగ్, రౌడీ షీటర్లపై బైండోవర్, కుల మత వివాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.

Similar News

News February 16, 2026

నెల్లూరు: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 50, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470

News February 16, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.