News November 1, 2025
PDPL: ‘భూభారతి దరఖాస్తులు వెంటనే డిస్పోజ్ అవ్వాలి’

భూభారతి పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ ద్వారా పౌరసేవల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయాలన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వనజ, తహశీల్దార్ జగదీశ్వర రావు, తదితరులు ఉన్నారు.
Similar News
News November 2, 2025
మిడ్జిల్: ‘వేధింపుల కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’

మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌ను రిమాండ్‌కు పంపినట్టు సీఐ కమలాకర్ తెలిపారు. శ్రావణ్ లైంగిక వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన కూతురిలా మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా, నిందితుడు శ్రావణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు విన్నవించుకున్నారు.
News November 2, 2025
T20Iలకు కేన్ మామ గుడ్ బై

NZ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్సన్ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011లో T20ల్లో డెబ్యూ చేసిన ఆయన 93 మ్యాచుల్లో 2,575 రన్స్ చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 95. కివీస్ తరఫున 75 మ్యాచులకు కెప్టెన్సీ చేశారు. షార్టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు తనతో పాటు జట్టుకూ ఇదే సరైన సమయమని కేన్ తెలిపారు. దీంతో రానున్న T20WC ప్రిపరేషన్‌కు జట్టుకు క్లారిటీ వస్తుందన్నారు.
News November 2, 2025
లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.


