News August 21, 2025
SEP 1న పెన్షన్ విద్రోహ దినం: తెలంగాణ ఉద్యోగ JAC

TG: తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మరోసారి జంగ్ సైరన్ మోగించింది. ‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హామీలు అమలు కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. 200కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో కలిసి పోరాడుతున్నాం. SEP 1న పెన్షన్ విద్రోహ దినం నిర్వహిస్తాం. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ చేపడతాం’ అని TGEJAC పేర్కొంది.
Similar News
News January 24, 2026
స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్

T20 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. భద్రతా కారణాల సాకుతో భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ICC ఆ జట్టును తప్పించింది. దీంతో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న <<18945385>>స్కాట్లాండ్<<>>కు అవకాశం దక్కింది. గ్రూప్ సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీతో తలపడనుంది. దీంతో స్కాట్లాండ్ మంచి ప్రదర్శన కనబరిస్తే టాప్-8కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఆ దేశానికి వరుసగా ఐదో T20 WC కావడం విశేషం.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేయండి

రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రేపు సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. బియ్యం, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు దానం చేస్తే శుభాలనిస్తుంది. మాంసాహారం, మద్యం సేవించకూడదు. కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.
News January 24, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్‌ఛార్జుల నియామకం

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.


