News April 21, 2024

గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొడుతున్నారు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీ ఫామ్ అందుకున్న ప్రతీ అభ్యర్థి గెలిచి రావాలి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కొత్త అభ్యర్థులు పార్టీ నిబంధనలు పాటించాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే నా ఆశయం. ప్రజాగళానికి వస్తున్న ఆదరణ చూసి జగన్ వణికిపోతున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేకే జగన్ డ్రామాలాడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News December 16, 2025

విజయ్ దివస్‌.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్‌నాథ్ నివాళులు

image

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్‌కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.

News December 16, 2025

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.

News December 16, 2025

ప్రముఖ నటుడిని చంపింది కొడుకే?

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రైనర్(78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్(68)లను వారి కుమారుడు నిక్ రైనర్ <<18569745>>హత్య<<>> చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిక్ కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసై పేరెంట్స్‌తో కాకుండా గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. హత్యకు ముందు కూడా హాలిడే పార్టీలో రాబ్‌తో నిక్ గొడవపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన హాలీవుడ్‌లో విషాదం నింపింది.