News March 6, 2025
రేవంత్ ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు: కిషన్ రెడ్డి

TG: BJPపై CM రేవంత్ చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. MLC ఎన్నికల్లో విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. HYDలో విజయోత్సవ సంబరాల అనంతరం మాట్లాడుతూ ‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా BJPని చూస్తున్నారు. కాంగ్రెస్‌ను వారు నమ్మడం లేదని ఈ ఫలితాలతో రుజువైంది. మేం కష్టపడితే MP ఎన్నికల్లోనూ మరిన్ని సీట్లు గెలిచేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 17, 2025
CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్‌కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<
News December 17, 2025
టోనర్ ఎంపిక ఇలా..

ప్రస్తుతం స్కిన్‌కేర్‌పై అందరికీ అవగాహన పెరిగింది. దీంట్లో ముఖ్యమైనది టోనర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారు తేమను అందించే టోనర్, సున్నితచర్మం ఉన్నవారు కలబంద, చామంతి గుణాలున్నవి, జిడ్డు చర్మం ఉన్నవారు తాజాదనాన్ని కలిగించేవి ఎంచుకోవాలి. ఆల్కహాల్, పారాబెన్స్, బెంజైల్ పెరాక్సైడ్ వంటివి హాని చేస్తాయి. కాబట్టి టోనర్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. <<-se>>#SkinCare<<>>


