News April 13, 2024

ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కుడు!

image

ఆగ్రాకు చెందిన హన్సురామ్ అంబేడ్కరీ(78)కి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారీ గెలవలేదు. రానున్న ఎన్నికలకూ ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ‘పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలకూ పోటీ చేశా. రాష్ట్రపతి పదవికీ ట్రై చేశా. తిరస్కరించారు. 100సార్లు నామినేషన్ నా లక్ష్యం. అది పూర్తయ్యాక మానేస్తాను’ అని తెలిపారు.

Similar News

News December 11, 2025

ఛార్జీలు పెంచబోమని ‘సర్దుబాటు’ బాదుడా: షర్మిల

image

AP: విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఓ పక్క CM CBN ప్రకటనలు చేస్తూ మరోపక్క సర్దుబాటు పేరిట ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవ్వడం దారుణమని PCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘సర్దుబాటు పేరుతో ఇప్పటికే ₹15000 కోట్లు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ మరో ₹15651 కోట్ల సర్దుబాటు ఛార్జీలకు APERC రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ప్రజలనుంచి అభిప్రాయాలకు నోటీసు జారీచేసింది.’ అని షర్మిల దుయ్యబట్టారు.

News December 11, 2025

DRDOపై స్టాండింగ్ డిఫెన్స్ కమిటీ ప్రశంసలు

image

హైపర్ సోనిక్ మిస్సైల్స్ తయారీ, అధునాతన టెక్నాలజీతో రక్షణ వ్యవస్థ ఏర్పాటులో DRDO సాధించిన ప్రగతిని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. రక్షణ పరికరాల తయారీకి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడం ద్వారా 5 ఏళ్లలో రూ.2,64,156 కోట్లు ఆదా చేసిందని రిపోర్టులో పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిధులతోపాటు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను DRDO కోరుతోందని తెలిపింది.

News December 11, 2025

కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.