News March 27, 2024
దానంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
Similar News
News February 13, 2026
15 చోట్ల హంగ్.. ఇండిపెండెట్లే కీలకం

TG: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏకంగా 15 చోట్ల హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, అలియాబాద్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు ఇండిపెండెంట్ల ఓట్లు, అలాగే ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి.
News February 13, 2026
విషాదం, శుభకార్యాల సమయాల్లో లోన్ రికవరీ వద్దు: RBI

రుణాలు తీసుకున్న వారి ఇళ్లలో విషాదం చోటుచేసుకున్నప్పుడు లేదా శుభ కార్యాలు జరిగే సమయాల్లో లోన్ రికవరీ చేయొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది. ‘రుణ రికవరీ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేరీతిన ఉండాలి. నిర్దేశిత రూల్స్ ప్రకారం ఏజెంట్ల నియామకం చేపట్టాలి. రికవరీ కోసం వారు చేసే ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయాలి’ అని పేర్కొంది. రుణగ్రహీతల డేటాను ఉద్యోగులు, ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని సూచించింది.
News February 13, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.


