News April 2, 2024
వివేకం సినిమా ప్రదర్శన నిలిపివేయాలని పిటిషన్

AP: వివేకం సినిమా ప్రదర్శనను యూట్యూబ్, ఓటీటీలలో నిలిపివేయాలని కోరుతూ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను అపకీర్తి పాల్జేసేలా చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. సీబీఐకి, పులివెందుల కోర్టులో తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సినిమా తీశారన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కోరారు.
Similar News
News February 18, 2026
ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం
News February 18, 2026
ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్‌పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.
News February 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


