News February 22, 2025
UPIతో PF విత్‌డ్రా.. మరో 2-3 నెలల్లో..!

UPI ద్వారా PF సొమ్మును విత్‌డ్రా చేసుకునే సదుపాయం మరో 2-3 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో EPFO చర్చిస్తోంది. దీని ద్వారా EPF ఉపసంహరణ సులభతరం అవుతుందని, జాప్యం, పనిభారం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఇది అమలైతే UPI లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగినట్లే PF ఖాతా నంబర్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.
Similar News
News November 14, 2025
ఒకేరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 సినిమాలు

ఇవాళ ఏకంగా మూడు సినిమాలు ఒకే OTTలోకి వచ్చేశాయి. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన ‘బైసన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విడుదలైన నెల రోజులలోపే ఈ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.
News November 14, 2025
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News November 14, 2025
BRSకు స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.


