News August 7, 2024
PHOTO: ఆస్పత్రి బెడ్డుపై వినేశ్ ఫొగట్

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ డీహైడ్రేషన్ కారణంగా <<13797123>>ఆస్పత్రిలో<<>> చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను పరామర్శించేందుకు భారత ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ పీటీ ఉష ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపే ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. చేతికి సెలైన్‌తో ఉన్న ఫొగట్‌ను చూసిన అభిమానులు ‘రియల్ ఫైటర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఆమె పోరాటం వృథా అయిన విషయం భారతీయుల గుండెలను పిండేసింది.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.
News December 16, 2025
రుషికొండ ప్యాలెస్ కోసం టాటా, లీలా గ్రూపుల ప్రతిపాదనలు

AP: విశాఖ రుషికొండ భవనాలపై <<17985023>>GOM<<>> చర్చించింది. ‘ఈ భవనాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్, లీలా ప్యాలెస్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వచ్చేవారం మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని మంత్రి కేశవ్ తెలిపారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదాయం పెరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ చెప్పారు.
News December 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 98 సమాధానం

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
సమాధానం: జరాసంధుడు
<<-se>>#Ithihasaluquiz<<>>


