News December 12, 2025
PHOTO VIRAL: వరల్డ్ కప్ హీరోస్

టీమ్‌ఇండియా-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో జరిగిన ఓ సీన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముల్లాన్‌పూర్ మైదానంలో తన పేరుతో స్టాండ్ ఓపెనింగ్ ఉండటంతో యువరాజ్ సింగ్ మ్యాచుకు వచ్చారు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తోనూ కాసేపు సరదాగా గడిపారు. ‘2007, 2011 వరల్డ్ కప్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ వీళ్లిద్దరి ఫొటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Similar News
News January 25, 2026
ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్’

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
News January 25, 2026
JNCASRలో ఉద్యోగాలు

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<
News January 25, 2026
సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.


