News March 28, 2024

గుడ్‌ ఫ్రైడే ముంగిట ఫొటో వైరల్

image

రేపు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడే జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో ముంబైలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏసు క్రీస్తు విగ్రహానికి అతి దగ్గరగా చంద్రుడు ఉండగా ఫొటోగ్రాఫర్ కెమెరాతో ఫొటో తీశారు. ఈసారి ఈస్టర్‌కు రెండు రోజుల ముందే మార్చి 29న గుడ్ ఫ్రైడే వచ్చింది. ఏసు క్రీస్తు మరణానికి సంతాపం తెలియజేసేందుకు దీన్ని జరుపుకుంటారు. అందుకే అన్ని పండుగల్లా ఆ రోజు చర్చీల్లో వేడుకలు జరగవు.

Similar News

News February 7, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>)లో 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://csio.res.in/

News February 7, 2026

రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

image

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.

News February 7, 2026

పవన్ సినిమాలో ఫౌజీ హీరోయిన్?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఉగాదికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఫౌజీ’ భామ ఇమాన్వి నటిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.