News December 1, 2025
PHOTOS: మెస్సీతో మ్యాచ్.. సీఎం రేవంత్ ప్రాక్టీస్

TG: ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ DEC 13న HYDలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అదే రోజు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నారు. మెస్సీ ప్రత్యర్థి జట్టు RR-9 కెప్టెన్‌గా సీఎం రేవంత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ప్రాక్టీస్ మొదలెట్టారు. పగలంతా బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉండే సీఎం రాత్రి వేళ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News February 12, 2026
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం
News February 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2026
భారత్‌లో రషీద్ ఖాన్ రికార్డు

భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ నిలిచారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చాహల్(49), అక్షర్(48), అర్ష్‌దీప్(43), హార్దిక్ పాండ్య(38), బుమ్రా(36), భువనేశ్వర్(34), వరుణ్(34) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఖాన్ 113 మ్యాచుల్లో 190 వికెట్లు తీశారు.


