News April 3, 2024
పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలి: నరేశ్

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడాన్ని అభినందిస్తున్నట్లు నటుడు నరేశ్ ట్వీట్ చేశారు. ‘రామ మందిరం కల సాకారం కావడానికి అద్వానీ ముఖ్య కారణం. అయితే, మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వకపోవడం బాధిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆయన్ను అవార్డుతో సత్కరించాలని మోదీని అభ్యర్థిస్తున్నా’ అని తెలిపారు.
Similar News
News February 18, 2026
అంబటికి బెయిల్

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News February 18, 2026
కూరగాయలు తాజాగా ఉండాలంటే?

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.
News February 18, 2026
డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it


