News July 5, 2024
పిన్నెల్లికి పోలీసు కస్టడీ

AP: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా.. మాచర్ల న్యాయస్థానం జడ్జి రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
Similar News
News December 11, 2025
నిద్ర తక్కువైతే!

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.
News December 11, 2025
అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.


