News May 26, 2024
పాక్‌తో ఆడటం కంటే IPL ఆడటం బెటర్: వాన్

ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో కంటే IPL ఆడటం బెటర్ అని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నారు. IPL అనుభవంతో టీ20 వరల్డ్ కప్‌లో రాణించవచ్చని చెప్పారు. ‘పాక్‌ను తక్కువగా అంచనా వేయట్లేదు. కానీ IPLలో ఆడితే విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాళ్లు మెరికల్లా తయారవుతారు. అక్కడ ఉండే ఒత్తిడి, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ యజమానులు, సోషల్ మీడియా ఇలా అన్నింటి నుంచి వారు ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
ఓటర్లను ఆకర్షించిన BJP హామీలు

అన్ని రంగాలను ప్రభావితం చేసేలా BJP ప్రకటించిన మ్యానిఫెస్టో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21,000 ఇస్తామన్న BJPని ప్రజలు నమ్మారు. గిగ్ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పని చేసే కార్మికులకు రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీ వాసులకు ఆస్తి హక్కులు, తదితర హామీలు ఓట్లు కురిపించాయి.
News February 8, 2025
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు టోనీ రాబర్ట్స్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుమార్తె వెల్లడించారు. ప్లే ఇట్ ఎగైన్, సామ్, రేడియో డేస్, స్టార్ డస్ట్ మెమోరీస్, హన్నా అండ్ హర్ సిస్టర్స్, ద గర్ల్స్ ఇన్ ద ఆఫీస్, కీ ఎక్స్ఛేంజ్, డర్టీ డాన్సింగ్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వైఫ్ సహా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన గాయకుడు కూడా.
News February 8, 2025
‘విష’ ప్రచారం వర్కౌట్ కాలేదు

ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక యమునా నది శుద్ధి ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు AAP ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాను రివర్స్ కౌంటర్ ఇద్దామని భావించి హరియాణా ప్రభుత్వం యమునా నదిని విషంగా మార్చి సరఫరా చేస్తోందని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా AKను వివరణ కోరింది. హరియాణా సీఎం సైనీ ఆ నీటిని తాగి చూపించిన వీడియోను రిలీజ్ చేయడంతో కేజ్రీ ‘విష’ ప్రచారం AAPకే బెడిసికొట్టింది.