News August 10, 2024
‘దయచేసి నాన్‌వెజ్ పంపకండి’.. వివాదంగా సర్క్యులర్!

విద్యార్థులకు టిఫిన్ బాక్సుల్లో నాన్‌వెజ్ పెట్టవద్దంటూ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్‌కి జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉదయం వండిన నాన్‌వెజ్ మధ్యాహ్నానికి పాడవుతుందని, అలాగే లంచ్ టైంలో కలిసి తినేటప్పుడు ఇతరులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సర్క్యులర్ ఇచ్చినట్టు చెప్పింది. అయితే దీన్ని కొందరు సమర్థించగా, ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు.
Similar News
News December 15, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*TG: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి.. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు
*ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్‌లో యూదులపై కాల్పులు.. 12 మంది మృతి
*మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
*మోదీ, షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారన్న రాహుల్ గాంధీ.. ఢిల్లీలో సభ
*అనకాపల్లిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
News December 15, 2025
కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్: కిషన్ రెడ్డి

“ఓట్ చోరీ” పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన <<18562660>>సభ<<>> అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ అంటూ దుష్ప్రచారానికి తెరతీశారన్న విషయం ప్రజలకు అర్థమైంది. కార్యకర్తలను బిజీగా ఉంచుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సభ్యులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
News December 15, 2025
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.


