News August 10, 2024
కేరళ చేరుకున్న పీఎం మోదీ

ప్రధాని మోదీ కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. వయనాడ్‌లో పీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సహాయక శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం, ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని కేరళ ఆశిస్తోంది.
Similar News
News December 11, 2025
తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్‌ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
ఓవర్‌స్పీడ్‌తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్‌లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 11, 2025
ESIC ఢిల్లీలో 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


