News April 13, 2024
నేను సీఎంగా ఉండుంటే పోలవరం పూర్తయ్యేది: CBN

AP: వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. తిక్కలోడికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధాని తయారు చేస్తామని.. కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాను సీఎంగా ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 14, 2025
ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.
News December 14, 2025
ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.


