News May 14, 2024

పోలింగ్: కరుణించిన వాతావరణం

image

AP: పోలింగ్ రోజున ఎండ ఇలాగే ఉంటే ఓటేసేదెలా అంటూ కొన్ని వారాల క్రితం ఆందోళన. గత కొన్ని రోజులుగా వర్షాలు మొదలవ్వడంతో వాన పడితే ఎలా అని మరో బెంగ. కానీ అటు భానుడు, ఇటు వరుణుడు కూడా పోలింగ్ రోజున కరుణించారు. పెద్దగా ఎండ, పెద్దగా వాన కూడా లేకుండా ఉష్ణోగ్రతలు సౌకర్యంగా ఉండటంతో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఓపిగ్గా లైన్లలో నిల్చుని ఓట్లు వేసి తమ బాధ్యతను నెరవేర్చారు.

Similar News

News December 17, 2025

ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News December 17, 2025

CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

image

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్‌కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.

News December 17, 2025

APPLY NOW: ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>> 28 సైంటిస్ట్-B పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/