News April 20, 2024
పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ (GR) జాబితాను TSPSC సైట్‌లో పొందుపొరిచారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని అధికారులు తెలిపారు. 247 లెక్చరర్ల పోస్టులకు డిసెంబర్, 2022న నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రాత పరీక్షలు జరిగాయి.
Similar News
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.


