News April 1, 2024
నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్దే

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ చిత్ర షూటింగ్‌లో చైతూ బిజీగా ఉన్నారు.
Similar News
News February 12, 2026
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్‌తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News February 12, 2026
‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్‌గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్‌బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్‌గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.
News February 12, 2026
US హౌస్‌లో ట్రంప్‌కు షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

US హౌస్ సభ్యులు ట్రంప్‌కు షాకిచ్చారు. <<18949938>>కెనడా<<>>పై విధించిన టారిఫ్స్‌ను తిరస్కరిస్తూ ఓటు వేశారు. డెమొక్రాట్లు తీసుకొచ్చిన తీర్మానం 219-211 తేడాతో నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) కూడా అనుకూలంగా ఓటేయడం గమనార్హం. అయితే దీనికి సెనేట్, ట్రంప్ ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.


