News February 14, 2025
ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్

బ్రాంకైటిస్ సమస్యతో పోప్ ఫ్రాన్సిస్(88) ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీంతో చికిత్స కోసం ఆయన్ను రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రికి తరలించినట్లు వాటికన్ అధికారులు తెలిపారు. 2023 మార్చిలో కూడా ఫ్రాన్సిస్ మూడు రోజుల పాటు ఆస్పత్రిపాలయ్యారు. ఇది కాక ఆయనకు ఇప్పటికే మోకాలు, తుంటి నొప్పి, పెద్దపేగు సంబంధిత సమస్యలున్నాయి. హెర్నియా సర్జరీ అయింది.
Similar News
News March 28, 2025
ఈ 3 రంగాలకు AIతో ముప్పు లేదు: బిల్ గేట్స్

AI వల్ల పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల ఉద్యోగాలను AI రీప్లేస్ చేయలేదు. AI కోడింగ్ చేసినా ప్రోగ్రామర్ల అవసరం ఉంటుంది. బయాలజిస్ట్‌లను కూడా అది భర్తీ చేయలేదు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిలో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని AI ఇంకా సొంతం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
News March 28, 2025
ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదు: శార్దూల్

IPL వేలంలో ఎంపిక కాకపోవడంతో ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదని LSG బౌలర్ శార్దూల్ ఠాకూర్ తెలిపారు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నా. రంజీలో ఆడుతున్నప్పుడు జహీర్ ఖాన్ ఫోన్ చేసి నన్ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటామని చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలు ఒక భాగం. నేను ఎప్పుడూ నా స్కిల్స్‌నే నమ్ముకుంటా’ అని పేర్కొన్నారు. గాయం కారణంగా టోర్నీకి దూరమైన మోహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చారు.
News March 28, 2025
నేడు ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ ప.గో జిల్లాలో పర్యటించనున్నారు. తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆయన ఆలోచన చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులతో సమావేశమవుతారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి, ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.