News May 7, 2025

ఇవాళ పోప్ అంత్యక్రియలు.. దేశాధినేతల హాజరు

image

వాటికన్‌సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రంప్, మెక్రాన్, స్టార్మర్, జెలెన్‌స్కీ, ద్రౌపదీ ముర్ము సహా 164 మంది దేశాల ప్రతినిధులు, అధినేతలు పాల్గొననున్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21న ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.

Similar News

News February 10, 2026

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

image

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News February 10, 2026

చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

image

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.

News February 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయనున్నారు.