News May 13, 2024
ఓటేస్తేనే ప్రశ్నించే అధికారం

‘హే.. నేనొక్కడిని ఓటు వేయకపోతే మునిగిపోయేది ఏం లేదులే..’ అని అనుకుంటాం మనలో చాలామంది. కానీ నీ ఒక్క ఓటే అభ్యర్థి ఫేట్ మారుస్తుంది. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడే క్యాండిడేట్ల ఆట కట్టిస్తుంది. నిఖార్సైన నాయకులకు ప్రజాసేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. సమస్యలపై నీకు ప్రశ్నించే అధికారమిస్తుంది. నువ్వు ఎవరికి వేశావనే దాని కంటే ఓటేశావా? లేదా? అనేదే ఇంపార్టెంట్. అందుకే నీ హక్కును వినియోగించుకో.
Similar News
News December 5, 2025
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అంశాలివే!

ఈ ఏడాది ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్ ‘Google’ రిలీజ్ చేసింది. ‘ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్’ విభాగంలో IPL అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత Google Gemini, Asia Cup, ICC Champions Trophy, Pro Kabaddi League, Maha Kumbh, Women’s World Cup, Grok, Saiyaara, ‘Dharmendra’ గురించి తెగ సెర్చ్ చేసినట్లు తెలిపింది. మరి మీరు ఏ విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? COMMENT
News December 5, 2025
IndiGoకే సమస్య ఎందుకు.. ఏం జరుగుతోంది?

దేశంలో IndiGo తప్ప మిగతా ఎయిర్‌లైన్స్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12గంటల రెస్ట్ ఇవ్వాలని DGCA ఇటీవల రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18నెలల గడువిచ్చింది. ఎయిరిండియా, ఆకాశ, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా, ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమవుతోంది.
News December 5, 2025
నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.


