News February 7, 2025
PPM: మన్యం జిల్లా ఆశావాహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి

పార్వతీపురం మన్యం దేశంలోని ఆశావాహ జిల్లాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆశావాహ జిల్లాల విభాగంలో పార్వతీపురానికి ప్రధానమంత్రి అవార్డు రావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని బ్లాక్‌తో పాటు జిల్లాలోనూ కొనసాగించాలన్నారు.
Similar News
News February 13, 2026
MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 13, 2026
మెదక్: టెన్త్ క్లాస్ టాపర్‌కు బంపర్ ఆఫర్

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.
News February 13, 2026
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం


