News November 17, 2025

PPP మోడల్‌లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి.. ఉయ్యూరు, గుడివాడ కూడా?

image

విజయవాడ ఆటోనగర్ బస్టాండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్‌ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రద్దీగా ఉన్న PNBSకి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ బస్టాండ్‌ను వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్‌ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Similar News

News January 14, 2026

జనగణన-2027కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

భారత జనగణన-2027 నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కేంద్ర సెన్సెస్ డైరెక్టరు జె.నివాస్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రావత్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News January 14, 2026

TU: ఈ నెల 21నుంచి పరీక్షలు

image

తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 21 నుంచి జరగనున్న పీజీ ఇంటిగ్రేటెడ్(APE/PCH), IMBA 3&5 సెమిస్టర్ల, LLB, LLM, 3వ సెమిస్టర్, B.Ed, B.P.Ed 1&3 సెమిస్టర్లకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ PG, ఇంటిగ్రేటెడ్ MBA, LLB, LLM విద్యార్థులకు డిచ్ పల్లి క్యాంపస్ లో, B.Ed, B.P.Ed విద్యార్థులకు 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.