News August 9, 2024

ఐదు సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీ

image

కొన్నాళ్లుగా షూటింగ్‌లకు విరామం తీసుకున్న ప్రభాస్ మళ్లీ బిజీ కానున్నారు. హను డైరెక్షన్‌లో ఈ నెల 17న కొత్త మూవీ ప్రారంభం కానుంది. దీనికి ఫౌజీ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. రాజాసాబ్ కొత్త షెడ్యూల్ ఈ నెలలోనే షురూ కానుంది. సలార్, కల్కి సీక్వెల్స్‌తోపాటు సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో మూవీ ఈ ఏడాదే మొదలవనుంది. మొత్తంగా డార్లింగ్ చేతిలో 5 సినిమాలున్నాయి.

Similar News

News December 16, 2025

BREAKING: భారత్ భారీ స్కోర్

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో జరిగిన వన్డేలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. 50 ఓవర్లలో 408/7 స్కోర్ చేశారు. అభిజ్ఞాన్ 125 బంతుల్లో అజేయంగా 209 రన్స్ చేశారు. ఇందులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేది 90, వైభవ్ 50, ఆయుశ్ మాత్రే 14, చౌహాన్ 14 రన్స్ చేశారు. కాగా ఈ టోర్నీలో భారత్ యూఏఈ, పాక్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.

News December 16, 2025

BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్‌లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.

News December 16, 2025

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.