News August 3, 2024
కమలా హారిస్‌తో డిబేట్‌కు సిద్ధం: ట్రంప్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌కు తాను సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెల 4న పెన్సిల్వేనియాలో జరిగే ఈ డిబేట్‌లో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే రోజు అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలో పాల్గొనాల్సి ఉందని, కానీ అది రద్దు కావడంతో దీనికి అంగీకరించానని వెల్లడించారు. కాగా ఈ డిబేట్‌లో పాల్గొనడంపై కమలా హారిస్ ఇంకా స్పందించలేదు.
Similar News
News December 8, 2025
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.
News December 8, 2025
పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

<
News December 8, 2025
శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


