News September 9, 2025

రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

image

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజాజీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘పేదల ఉన్నతికి, సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ VPగా నిలుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని PM మోదీ పేర్కొన్నారు. అమిత్‌షా, CBN, పవన్, లోకేశ్, జగన్ ఆయనకు విషెస్ తెలిపారు.

Similar News

News December 15, 2025

త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

image

TG: త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.

News December 15, 2025

నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

image

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

News December 15, 2025

ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

image

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.