News March 5, 2025

PRG: అలస్యమైన విద్యార్థి.. మొదటిరోజు పరీక్షకు దూరం

image

పరిగి పట్టణంలోని తుంకుల్ గడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యం అవ్వడంతో ఓ విద్యార్థి మొదటిరోజు పరీక్షకు దూరమయ్యాడు. ఎగ్జామ్స్ సెంటర్‌కు ఉదయం 9:20 గంటలకు రావడంతో నిర్వాహకులు అనుమతించలేదు. ఎంత బతిమిలాడినా లోపలికి అనుమతించకపోవడంతో చేసేది ఏమీ లేక నిరాశతో విద్యార్థి వెనుదిరిగాడు.

Similar News

News December 11, 2025

నిద్ర తక్కువైతే!

image

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.

News December 11, 2025

ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

image

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.

News December 11, 2025

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

image

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.