News April 14, 2024
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, భవిష్యత్తులో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.
Similar News
News December 11, 2025
బంగ్లాదేశ్‌కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్‌కు ముప్పు?

బంగ్లాదేశ్‌కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్‌కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్‌మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్‌కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
News December 11, 2025
చలి పంజా.. బయటికి రావద్దు!

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.
News December 11, 2025
SHOCKING: వీర్యదాత వల్ల 197 మందికి క్యాన్సర్ ప్రమాదం

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే TP53 జన్యు మ్యుటేషన్ ఉన్న విషయం తెలియని వ్యక్తి దానం చేసిన వీర్యం ద్వారా యూరప్‌లో 197 మంది పిల్లలు పుట్టారు. 2005 నుంచి అతను వీర్యదాతగా ఉన్నారు. ఈ వీర్యాన్ని సరఫరా చేసిన డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ బాధిత కుటుంబాలకు తాజాగా సారీ చెప్పింది. ఈ పిల్లల్లో కొందరు ఇప్పటికే క్యాన్సర్‌తో మరణించారు. మిగతావారికీ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు తెలిపారు.


