News May 4, 2024
14న ప్రధాని మోదీ నామినేషన్

వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. 13వ తేదీన స్థానికంగా భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ.. మూడోసారి ఇక్కడే బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అజయ్ రాయ్ బరిలో నిలుస్తున్నారు.
Similar News
News December 15, 2025
కోదాడ: SI జాబ్‌కు రాజీనామా.. సర్పంచ్ ఎన్నిక ఫలితం ఇదే..!

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు ఇటీవల ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా ఈరోజు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మందుల నాగయ్య చేతిలో 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మందుల నాగయ్య గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
News December 15, 2025
నంద్యాల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా.. ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.