News April 2, 2024
యాసిడ్ దాడి బాధితులతో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాసిడ్ దాడి బాధితులను కలిశారు. బిజీ షెడ్యూల్‌లోనూ ఆమె అతిజీవన్ ఫౌండేషన్‌కు వచ్చారని సామాజిక కార్యకర్త ప్రగ్యా ప్రసూన్ తెలిపారు. యాసిడ్ విక్టిమ్స్‌తో ప్రియాంక మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. వారితో ఆమె దిగిన ఫొటోలను ప్రగ్యా ఇన్‌స్టాలో పంచుకున్నారు. బాధితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చినందుకు ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 17, 2026
కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.


