News March 26, 2024
ఎమ్మెల్సీ కవితకు జైలులో సౌకర్యాల కల్పన

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉంటున్న BRS ఎమ్మెల్సీ కవితకు కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెన్ను, పేపర్లు, నగదు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. కాగా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Similar News
News February 16, 2026
భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.
News February 16, 2026
బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?

AP శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించేలా విభజన చట్ట సవరణ బిల్లుపై కసరత్తు చురుగ్గా సాగుతోంది. పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీన్ని ప్రవేశపెడతారని TDP వర్గాలు పేర్కొంటున్నాయి. టెక్నికల్, లీగల్ అంశాలపై న్యాయ, పట్టణ గృహనిర్మాణ, నీతి ఆయోగ్‌లకు హోమ్ శాఖ నోట్‌ను పంపింది. అనంతరం క్యాబినెట్ ఆమోదంతో బిల్లును పార్లమెంటులో పెడతారు. కాగా CM CBN ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు.
News February 16, 2026
T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.


