News May 14, 2024
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివర్తి నాని

AP: కొందరు వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే దాడిలో నాని గన్‌మెన్ కూడా గాయపడ్డారు. అతడిని ఓ వ్యక్తి సమ్మెటతో దాడి చేయగా.. కణత భాగంలో గాయమైంది.
Similar News
News December 15, 2025
2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

TG: 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Xలో ఆమె #AskKavitha హ్యాష్ ట్యాగ్‌తో క్వశ్చన్ హవర్ నిర్వహిస్తున్నారు. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని ఆమె బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని పేర్కొన్నారు.
News December 15, 2025
ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్‌గా షెఫాలీ, హార్మర్

ఈ ఏడాది వన్డే WC ఫైనల్లో రాణించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్) అవార్డు గెలుచుకున్నారు. ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వర్మ.. ఫైనల్లో 87 రన్స్&2 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకమయ్యారు. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఆయన 17 వికెట్లు తీశారు.
News December 15, 2025
ఒకే రోజు రెండుసార్లు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18569611>>ఉదయం<<>> నుంచి రెండుసార్లు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,470 పెరిగి రూ.1,35,380కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,940 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,24,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


