News March 25, 2024

ముఖ్య నేతలతో పురందీశ్వరి సమీక్ష

image

AP: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. ఇటు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

Similar News

News December 14, 2025

లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

image

✦ 2026, జనవరి 1న వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా థియేటర్లలో రీరిలీజ్
✦ ఈరోజు సా.6.30 గంటలకు ‘రాజాసాబ్’ నుంచి ‘సహానా సహానా’ పాట ప్రోమో విడుదల.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
✦ ‘మోగ్లీ’ సినిమాకు తొలి రోజు రూ.1.22 కోట్ల కలెక్షన్స్
✦ డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం?

News December 14, 2025

మోదీని తొలగించడమే కాంగ్రెస్ అసలు అజెండా: బీజేపీ

image

ప్రధాని మోదీని పదవి నుంచి దింపేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని BJP ఆరోపించింది. ఓట్ చోరీ పేరుతో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీ అసలు అజెండా ఇప్పుడు బయటపడిందని విమర్శించింది. మోదీ పాలన ముగిసిపోతుందని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై మండిపడింది. ‘కాంగ్రెస్ ర్యాలీ SIRకు వ్యతిరేకంగా కాదు. మోదీని పదవి నుంచి తొలగించడానికే. తమ ప్రియతమ నాయకుడిని అగౌరవపరిస్తే ప్రజలు సహించరు’ అని హెచ్చరించింది.

News December 14, 2025

15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/